- టి20 మహిళల ప్రపంచకప్
జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా వేదికగా మహిళల టి20 ప్రపంచకప్ జరగనుంది. మొత్తం 10జట్లు పాల్గొనే టోర్నమెంట్ దక్షిణాఫ్రికా జట్టు తొలిసారి ఆతిథ్యమిస్తోంది. ఆస్ట్రేలియా మహిళల జట్టు ఏకంగా 5సార్లు టైటిల్‌ను గెలుచుకొని రికార్డు నెలకొల్పింది. ఇటీవలికాలంలో భారత మహిళల జట్టు అద్భుత ఫామ్‌లో ఉండగా.. ఇటీవల అండర్-19 మహిళల ప్రపంచకప్ టైటిల్‌ను భారత్ గెలుపొందిన ఉత్సాహంగా ఈ టోర్నీలో రాణించాలని చూస్తోంది.
గ్రూప్-1 : ఆస్ట్రేలియా(5సార్లు ఛాంపియన్), బంగ్లాదేశ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక
గ్రూప్-2 : ఇండియా, పాకిస్తాన్, ఇంగ్లండ్, ఐర్లాండ్, వెస్టిండీస్,
- తొలి ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఓటమి..
ఆస్ట్రేలియా చేతిలో జరిగిన తొలి ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారతజట్టు పరాజయాన్ని చవిచూసింది. తొలుత బౌలర్లు రాణించడంతో 129పరుగులకే ఆస్ట్రేలియాను కట్టడి చేసిన భారత్.. ఛేదనలో ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి 85పరుగులకే ఆలౌటైంది. హర్లిన్ డియెల్(12), దీప్తిశర్మ(15), అంజలి(15) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. 18పరుగులు అత్యధికంగా వచ్చాయి. బ్రౌన్‌కు నాలుగు, గార్డినర్‌కు రెండు వికెట్లు దక్కాయి. అంతకుముందు శిఖా పాండే, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్ రెండేసి వికెట్ల రాణించడంతో ఆసీస్ జట్టు భారీస్కోర్ చేయలేకపోయింది. ఆ జట్టులో ఓపెనర్ మూనీ(28), గార్డినర్(22)కి తోడు చివర్లో వారెహాన్(32), జొన్నాసెన్(22) రాణించి ఆసీస్ జట్టు గౌరవప్రద స్కోర్‌కు దోహదపడ్డారు.










