ఇంగ్లండ్ కౌంటీ ఛాంపియన్ షిప్ డివిజన్-2లో ససెక్స్ జట్టుకు టీమిండియా వెటరన్ ఆటగాడు ఛెతేశ్వర్ పుజారా సారథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.కప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన తొలి మ్యాచ్‌లోనే పుజారా సెంచరీతో అదరగొట్టాడు. హౌప్ వేదికగా డర్హమ్‌తో మ్యాచ్ తొలి ఇన్సింగ్స్‌లో పుజారా 134 బంతుల్లో శతకం కొట్టాడు. టామ్ క్లార్క్‌తో కలిసి 112 పరుగులు కీలక భాగస్వామ్యం నమోదు చేశాడు. ఓవరాల్‌గా తొలి ఇన్సింగ్స్ లో 163 బంతులు ఎదుర్కొన్న పుజారా 13 ఫోర్లు, ఒక సిక్స్ తో 115 పరుగులు చేశాడు. ఇక రెండో రోజు ఆట ముగిసే సమయానికి ససెక్స్ 9 వికెట్ల నష్టానికి 332 పరుగులు చేసింది. ససెక్స్ బ్యాటర్లలో పుజారా టాప్ స్కోరర్, ఓలివర్ కార్టర్ ( 41) పరుగులతో పర్వాలేదనిపించాడు. అంతకుముందు డర్హామ్ తమ తొలి ఇన్సింగ్‌లో 376 పరుగులు చేసి ఆలౌట్ అయింది.










