Sep 20,2023 16:29

విజయవాడ: చంద్రబాబు త్వరగా విడుదల అవ్వాలని కోరుకుంటూ పశ్చిమ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జలీల్‌ ఖాన్‌ ఆధ్వర్యంలో సర్వ మత ప్రార్థనలు చేపట్టారు. ఈ సందర్భంగా జలీల్‌ ఖాన్‌ మాట్లాడారు. ''చంద్రబాబు అరెస్ట్‌ అయిన దగ్గర నుంచి నిరసన దీక్షలు చేస్తూనే ఉన్నాం. రెండు రోజుల్లో చంద్రబాబు విడుదల కాకపోతే నేనూ ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను. రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మచ్చలేని నాయకుడు చంద్రబాబు. కక్షపూరితంగా కావాలనే చంద్రబాబును అరెస్టు చేసేశారు. జగన్మోహన్‌ రెడ్డి నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా అధికారం రాదు. చంద్రబాబుకే ప్రజలు మద్దతు పలుకుతున్నారు. జగన్మోహన్‌ రెడ్డి నాలుగు సంవత్సరాల్లో రూ.12 లక్షల కోట్లు అప్పులు చేశారు. ప్రజల మీద కరెంటు, ఆర్టీసీ చార్జీలు విపరీతంగా పెంచేశారు. రాష్ట్రంలో తిరుగుబాటు వస్తుంది.'' అని వ్యాఖ్యానించారు.