రాజమహేంద్రవరం: అవినీతిని ప్రశ్నించినందుకే టిడిపి అధినేత చంద్రబాబును అక్రమంగా జైల్లో పెట్టారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ అన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టయి రాజమహేంద్రవరం జైల్లో ఉన్న చంద్రబాబును కుటుంబ సభ్యులు భువనేశ్వరి, బ్రాహ్మణితో కలిసి లోకేశ్ ములాఖత్ అయ్యారు. అనంతరం లోకేశ్ మీడియాతో మాట్లాడుతూ.. '' పోలవరంపై మాట్లాడితే చంద్రబాబును రిమాండ్‌కు పంపారు. ప్రభుత్వ తప్పులు బయటపెట్టి.. ప్రజల తరఫున పోరాడితే దొంగ కేసు పెట్టారు. 28 రోజులుగా రిమాండ్‌లో పెట్టారు. స్కిల్ కేసులో తొలుత రూ.3 వేల కోట్ల అవినీతి అని చెప్పారు. అనంతరం రూ.300 కోట్లు అని ఆరోపించారు. కక్ష సాధింపుతోనే చంద్రబాబును రిమాండ్‌కు పంపారు. వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబును రిమాండ్‌కు పంపారు. '' అని లోకేశ్ అన్నారు.










