కోల్‌కతా: యజ్ఞేంద్ర చాహల్ స్పిన్ మాయాజాలానికి కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాటర్స్ కుదేలయ్యారు. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతాకు వెంకటేశ్ అయ్యర్(57) మినహా.. ఆదుకునే మరో బ్యాటర్ కరువయ్యాడు. దీంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8వికెట్లు 149పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతాకు ఓపెనర్ జేసన్ రారు(10) మరోసారి నిరాశపరిచాడు. ఆ తర్వాత గుర్బాజ్(18) కూడా త్వరగా పెవీలియన్‌కు చేరడంతో ఆ జట్టు 29పరుగులుకే 2వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ దశలో వెంకటేశ్ అయ్యర్ అర్ధసెంచరీకి తోడు కెప్టెన్ నితీశ్ రాణా(22) కొద్దిసేపు క్రీజ్‌లో పాతుకుపోయారు. వీరిద్దరినీ చాహల్ పెవీలియన్‌కు పపండం, ఆ తర్వాత శార్దూల్, రింకూలను కూడా ఔట్ చేయడంతో కోల్‌కతా జట్టు కోలుకోలేకపోయింది. ఆండీ రస్సెల్(10), రింకూ సింగ్(16), రెండంకెల స్కోర్ చేయగా.. శార్దూల్(1), నరైన్(6) సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. చాహల్‌కు నాలుగు, బౌల్ట్‌కు రెండు, సందీప్ శర్మ, ఆసిఫ్‌కు ఒక్కో వికెట్ దక్కాయి.
- చాహల్ రికార్డు
రాజస్తాన్ రాయల్స్ స్పిన్నర్ యజ్ఞేంద్ర చాహల్ ఐపిఎల్‌లో ఓ రికార్డును తన పేర లిఖించుకున్నాడు. ఐపిఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా చాహలక్ష నిలిచాడు. గురువారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్ సందర్భంగా కోల్‌కతా కెప్టెన్ నితీశ్ రాణాను ఔట్‌చేసి ఐపిఎల్ కెరీర్‌లో 184వికెట్లు తీసినట్లయింది. దీంతో ఐపిఎల్‌లో ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్ డ్వైన్ బ్రేవో (183 వికెట్లు)ను చాహల్ అధిగమించాడు. ఇక చాహల్ 143మ్యాచుల్లో 184వికెట్లు తీశాడు. ఇక చాహల్ 2022 సీజన్‌లో 17ఇన్నింగ్స్‌లో 27వికెట్లు తీసి పర్పుల్ క్యాప్‌ను అందుకున్న సంగతి తెలిసిందే. ఐపిఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన టాప్-5 బౌలర్ల జాబితాలో పియూష్ చావ్లా(ముంబయి ఇండియన్స్-174వికెట్లు), అమిత్ మిశ్రా (లక్నో సూపర్‌జెయింట్స్-172వికెట్లు), ఆ తర్వాత రవిచంద్రన్ అశ్విన్ (రాజస్తాన్ రాయల్స్-171వికెట్లు) ఉన్నారు. ఇక కోల్‌కతాపై మ్యాచ్ సందర్భం చాహల్ 4ఓవర్లలో 25పరుగులిచ్చి 4వికెట్లు తీసాడు. అలాగే ఈ సీజన్-16 ఐపిఎల్‌లోన 23 వికెట్లతో పర్పుల్ క్యాప్ అందుకున్నాడు.
స్కోర్‌బోర్డు..
కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: జేసన్ రారు (సి)హెట్‌మైర్ (బి)బౌల్ట్ 10, గుర్బాజ్ (సి)సందీప్ శర్మ (బి)బౌల్ట్ 18, వెంకటేశ్ అయ్యర్ (సి)బౌల్ట్ (బి)చాహల్ 57, నితీశ్ రాణా (సి)హెట్‌మైర్ (బి)చాహల్ 22, ఆండీ రస్సెల్ (సి)అశ్విన్ (బి)ఆసిఫ్ 10, రింకూ సింగ్ (సి)రూట్ (బి)చాహల్ 16, శార్దూల్ (ఎల్‌బి) చాహల్ 1, అనుకుల్ రారు (నాటౌట్) 6, సునీల్ నరైన్ (సి)రూట్ (బి)సందీప్ శర్మ 6, అదనం 3. (20 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి) 149పరుగులు.
వికెట్ల పతనం: 1/14, 2/29, 3/77, 4/107, 5/127, 6/129, 7/140, 8/149
బౌలింగ్: బౌల్ట్ 3-0-15-2, సందీప్ శర్మ 4-0-34-1, అశ్విన్ 4-0-32-0, రూట్ 2-0-14-0, చాహల్ 4-0-25-4, ఆసిఫ్ 3-0-27-1.










