కెనడా పాప్‌సింగర్ ఎపి ఢిల్లాన్,
వ్యాఖ్యాతగా మందిరా బేడి
ముంబయి: భారత క్రికెట్ కంట్రోల్‌బోర్డు(బిసిసిఐ) ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న మహిళల ప్రిమియర్‌లీగ్(డబ్ల్యుపిఎల్) ప్రారంభోత్సవ వేడుకలు డివై పాటిల్ స్టేడియంలో శనివారం అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకల్లో కెనడా పాప్ సింగర్ ఎపి ఢిల్లాన్ పాడిన పాటలు ప్రేక్షకులను మంత్రముగ్గులను చేశాయి. బాలీవుడ్ నటులు కృతి సనన్, కియారా అద్వానీ స్టేజ్‌పై నృత్యం చేశారు. 'చక్ దే ఇండియా' పాటకు ప్రేక్షకులు స్వరం పలికారు. ప్రధాన వ్యాఖ్యాతగా మందిరా బేడీ వ్యవహరించారు. సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం కనులు మిరుమిట్లు గొలిపే లేజర్ షోలతో మైదాన ప్రాంగణమంతా పండుగ వాతావరణం నెలకొంది. ఐదు జట్ల కెప్టెన్లను స్టేజ్‌పైకి పిలిచి బిసిసిఐ అధ్యక్షులు పరిచయం చేశారు. ఐదుజట్ల కెప్టెన్లు కలిసి డబ్ల్యుపిఎల్ ట్రోఫీని ఆవిష్కరించారు.










