రాజమహేంద్రవరం: టిడిపి అధినేత చంద్రబాబుపై వైసిపి పెట్టిన అక్రమ కేసులు తెలుగుదేశం శ్రేణుల మనోధైర్యాన్ని దెబ్బతీయలేవని నందమూరి, నారా కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. నందమూరి రామకృష్ణ, నారా రోహిత్, భరత్ మంగళవారం రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడారు. పార్టీ కార్యకర్తలు ఎవరూ అధైర్యపడొద్దని, తామంతా ఒకరికొకరం అండగా ఉంటూ ముందుండి నడిపిస్తామని అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించేందుకు చంద్రబాబు క్లీన్ చిట్‌తో బయటకు వస్తారన్నారు.'' సాక్ష్యాలు లేకుండా చంద్రబాబును అరెస్టు చేయడం దారుణం. ఎఫ్‌ఐఆర్‌లో పేరు లేకుండా ఆయన్ను ఎలా అరెస్టు చేశారు? కేసులో నిజంగా ఆధారాలు దొరికితే రెండున్నరేళ్లు ఎందుకు ఆగారు. అన్ని వ్యవస్థల అండతో ప్రతిపక్షాలను వేధిస్తున్నారు. షెల్ కంపెనీలకు చంద్రబాబుకు ఏంటి సంబంధం? చంద్రబాబు వయసుకు తగిన గౌరవం కూడా ఇవ్వడం లేదు. చంద్రబాబు పెళ్లి రోజు చూసుకొని మరీ అరెస్టు చేశారు. మా కుటుంబం అంతా ప్రజాక్షేత్రంలో పోరాడుతాం. ప్రజల సంక్షేమం కోసం ఎన్టీఆర్ పెట్టిన పార్టీ మాది. యువతకు మంచి చేయాలనే గత్ర ప్రభుత్వం చేసింది. నైపుణ్యాభివఅద్ధి ద్వారా శిక్షణ పొందిన వేలాది మందికి ఉద్యోగాలు వచ్చాయి. అన్ని వ్యవస్థల అండతో ప్రతిపక్ష నేతలను బెదిరిస్తున్నారు. జగన్ రాసిన స్క్రిప్ట్‌ను అధికారులు అమలు చేశారు. చంద్రబాబు వయసు, హోదాకు కూడా గౌరవం ఇవ్వలేదు'' అని ఆవేదన వ్యక్తం చేశారు.










