Oct 10,2023 07:50

అమరావతి : ఆదిలాబాద్‌- తిరుపతి మధ్య కాజీపేట మీదుగా నడిచే కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ ఈనెల 10, 11 తేదీలలో రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. సికింద్రాబాద్‌ డివిజన్‌ పరిధిలో జరిగే ఇంటర్‌లాకింగ్‌ పనుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇప్పటికే టికెట్లు రిజర్వేషన్‌ చేసుకున్న వారికి తిరిగి నగదు చెల్లిస్తామని చెప్పారు. గడిచిన రెండు వారాల్లో కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేయడం ఇది రెండోసారి. కాజీపేట- డోర్నకల్‌ మధ్య నడిచే డోర్నకల్‌ ప్యాసింజరు, సికింద్రాబాద్‌- వరంగల్‌ మధ్య నడిచే పుష్‌పుల్‌, కాజీపేట -బల్లార్షా మధ్య నడిచే బల్లార్షా ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల రద్దును ఈనెల 15 వరకు పొడిగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.