ప్రజాశక్తి-కలెక్టరేట్ (కృష్ణా) : 2023-అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ... సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వమువారు జాతీయ అవార్డు కోసం దరఖాస్తులు కోరుతున్నట్లు విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు వి.కామరాజు తెలిపారు. వికలాంగుల పునరావాసం, స్వయం ఉపాధి, ఉద్యోగము, ఉద్యోగ కల్పన, సాంకేతికత, క్రీడలు, అవరోధరహిత వాతావరణం, అత్యుత్తమ సృజనాత్మకత కలిగిన విభిన్న ప్రతిభావంతులైన వయోజనులు, ఉత్తమ సృజనాత్మకత కలిగిన విభిన్న ప్రతిభావంతులైన చిన్నారులు, మొదలగు వివిధ రంగాలలో కృషి చేసిన అత్యంత ప్రతిభ కనపరచిన విభిన్న ప్రతిభావంతులు, స్వచ్ఛంద సంస్థలవారు విభిన్న ప్రతిభావంతులు www.disabilityaffairs.gov.in అను వెబ్ సైట్ ద్వారా జూలై 31 లోపు వారి నామినేషన్‌ను ఆన్ లైన్ ద్వారా నమోదు చేసుకోవాలని తెలిపారు.










