Jan 13,2023 11:26

ప్రజాశక్తి- అమరావతి బ్యూరో : ప్రజాశక్తి బుకహేౌస్‌ సంపాదకులు ఎస్‌. వెంకట్రావు సోదరుడు, సిపిఎం సానుభూతిపరుడు ఎస్‌. అనంత్‌ మృతి చెందారు. ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్న ఆయన గురువారం రాత్రి విద్యుత్‌షాక్‌కు గురై పడిపోయారు. దీనిని గమనించిన స్థానికులు హుటాహుటిన పక్కనే ఉన్న మణిపాల్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే, మార్గమధ్యలోనే ఆయన మరణించారు. సిపిఎం తాడేపల్లి రూరల్‌ కార్యదర్శి డి వెంకటరెడ్డితో పాటు పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు అనంత్‌ బౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. శుక్రవారం సాయంత్రం నాలుగుగంటలకు అంత్యక్రియలను నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.