Dec 12,2022 22:31

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో తుఫాన్‌ బాధితులపట్ల కలెక్టర్లు ఉధారంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో సోమవారం తుపాన్‌ నష్టాలపై జిల్లాల కలెక్టర్లతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పంట నష్టం సర్వేలో అధికారులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలన్నారు. సర్వేను తక్షణం ప్రారంభించాలన్నారు. ధాన్యం రంగుమారినా, తడిసినా కొనుగోలు చేయలేదను మాట ఎక్కడా రాకూడదని అన్నారు. ధరకూడా తగ్గించకుండా కొనుగోలు చేయాలన్నారు. రైతులు బయట అమ్ముకుంటామంటే వారికి అక్కడ కూడా ధర వచ్చేలా చూడాలన్నారు. దీనికి అధికారులు బాధ్యత తీసుకోవాలన్నారు. పంటలు దెబ్బతినుచోట మళ్లీ పంటలు వేసుకునేందుకు 80 శాతం సబ్సిడీతో విత్తనాలు అందించాలని ఆదేశించారు. పంటలు దెబ్బతిను ప్రతిరైతుకూ సబ్సిడీ విత్తనాలను అందించాలన్నారు. ఎక్కడైనా ఇళ్లు ముంపునకు గురైతే ఆ కుటుంబాలకు రెండువేల రూపాయలతోపాటు, రేషన్‌ను అందించాలని సూచించారు. ప్రభుత్వం పట్టించుకోలేదనే మాట ఎక్కడా రాకూడదన్నారు. పట్టణాలు, పల్లెలతో సంబంధం లేకుండా ఈ సహాయాన్ని బాధితులందరికీ అందించాలని ఆదేశించారు. వారం రోజుల్లో సహాయక చర్యలు అనీు పూర్తికావాలన్నారు. ఎక్కడైనా పశువులకు నష్టం జరిగినా ఆ పరిహారం కూడా సత్వరమే అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, సిఎస్‌ డాక్టర్‌ కెఎస్‌ జవహర్‌ రెడ్డి, పట్టణాభివఅద్ధిశాఖ స్పెషల్‌ సిఎస్‌ వై.శ్రీలక్ష్మి, సిసిఎల్‌ఏ జి సాయిప్రసాద్‌, ఇంధనశాఖ స్పెషల్‌ సిఎస్‌ విజయానంద్‌, జలవనరులశాఖ ముఖ్యకార్యదర్శి శశి భూషణ్‌కుమార్‌, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి ఎంటి కృష్ణబాబు, వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి వై మధుసూదన్‌రెడ్డి, పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ హెచ్‌ అరుణ్‌కుమార్‌, రవాణాశాఖ కార్యదర్శి పిఎస్‌ ప్రద్యుము, వ్యవసాయశాఖ కమిషనర్‌ సి హరికిరణ్‌, డిజాస్టర్‌ మేనేజిమెంట్‌ డైరెక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ హాజరయ్యారు.