అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం తనపై పెట్టిన కేసులో అదఅష్టం న్యాయదేవత రూపంలో నిలబడిందని టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. మంత్రి రోజాపై వ్యాఖ్యల కేసులో అరెస్టై విడుదలైన నేపథ్యంలో మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయానికి ఆయన వచ్చారు. అక్కడ ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం బండారు మీడియాతో మాట్లాడారు.''దుర్మార్గపు చర్యలతో సీఎం జగన్ మమ్మల్ని భయపెట్టలేరు. మిగిలిన 4 నెలలైనా ఆయన బుద్ధి మార్చుకుంటే మంచిది. ఇష్టం వచ్చినట్లు మాట్లాడినందునే రోజాకు బుద్ధి చెప్పా. ఆమెపై నా వ్యాఖ్యలకు వచ్చిన స్పందనను సీఎం కూడా విశ్లేషించుకోవాలి'' అని బండారు వ్యాఖ్యానించారు.










