విజయవాడ : చంద్రబాబుకు ఐదు రోజుల కస్టడీ కోరుతూ ... ఎసిబి కోర్టులో సిఐడి పిటిషన్ వేసింది. చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై ఎసిబి కోర్టులో సోమవారం విచారణ జరిగింది. సిఐడి తరపు న్యాయవాది కౌంటర్ దాఖలు చేశారు. కౌంటర్‌లో సవరణలు చేసి మళ్లీ ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు. కస్టడీ విచారణ నివేదికను సీల్డ్ కవర్‌లో కోర్టుకు సిఐడి సమర్పించింది. ఐదు రోజుల కస్టడీ కావాలని సిఐడి పిటిషన్ దాఖలు చేసింది.










