Apr 25,2023 21:08

గాలే: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఐర్లాండ్‌ జట్టు భారీస్కోర్‌ను నమోదు చేసింది. ఓవర్‌నైట్‌ స్కోర్‌ 4వికెట్ల నష్టానికి 319పరుగులతో మంగళవారం తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఐర్లాండ్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 492పరుగులకు ఆలౌటైంది. స్టెర్లింగ్‌(103), క్యాంఫర్‌(111) సెంచరీలతో కదం తొక్కారు. వికెట్‌ కీపర్‌ టక్కర్‌(80) కూడా బ్యాటింగ్‌లో రాణించడంతో ఐర్లాండ్‌ జట్టు భారీస్కోర్‌ను నమోదు చేసింది. జయసూరియకు ఐదు, విశ్వ ఫెర్నాండో, అశిత ఫెర్నాండోకు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన శ్రీలంక జట్టు రెండోరోజు ఆట ముగిసే సమయానికి వికెట్లేమీ నష్టపోకుండా 81పరుగులు చేసింది. మధుశక(41), కెప్టెన్‌ కరుణరత్నే(39) క్రీజ్‌లో ఉన్నారు.

2