Mar 11,2023 09:34

ముంబయి : బ్రాబౌర్న్‌ వేదికగా జరిగిన మహిళల ప్రిమియర్‌ లీగ్‌(డబ్ల్యుపిఎల్‌)లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగ ళూరు(ఆర్సీబీ)పై యుపి వారియర్స్‌ జట్టు 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరుకు ఓపెనర్‌, కెప్టెన్‌ స్మృతి మంధాన(4)మరోసారి నిరాశపరిచింది. ఆ తర్వాత సోఫీ డివైన్‌(36), ఎలీసా ఫెర్రీ(52) రాణించడంతో బెంగళూరు భారీస్కోర్‌ చేసేలా కనిపించింది. ఆ తర్వాత బెంగళూరు వరుసగా వికెట్లను కోల్పోవడంతో నిర్ణీత 19.3ఓవర్లలో 138పరుగులకు ఆలౌ టైంది. ఎక్లేస్టోన్‌కు నాలుగు, దీప్తి శర్మకు మూడు వికెట్లు దక్కా యి. అనంతరం యుపి ఓపెనర్లు దేవిక వైద్య(36), అలైసా హీలీ(96) వికెట్‌ కోల్పోకుండా 13 ఓవర్లలోనే 139పరుగులు చేసి గెలిచింది. ప్లేయర్‌ ఆఫ్‌ మ్యాచ్‌ హీలీకి లభించింది.