- బెంగళూరుపై తొమ్మిది వికెట్ల తేడాతో ముంబయి గెలుపు
ముంబయి : బ్రాబౌర్న్ వేదికగా జరిగిన మహిళల ప్రిమియర్ లీగ్(డబ్ల్యుపి ఎల్)లో ముంబయి ఇండియన్స్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విజయాన్ని సొంతం చేసుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నిర్దేశించిన 156పరు గుల లక్ష్యాన్ని ముంబయి వికెట్ కోల్పోయి ఛేదించింది. దీంతో ముంబయి జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. సోమవారం టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరుకు ఓపెనర్, కెప్టెన్ స్మృతి మంధాన(23), సోఫియా డివైన్(16) నిరాశపరిచారు. ఆ తర్వాత బెంగళూరు జట్టు వరుసగా వికెట్లను కోల్పోయింది. చివర్లో అహూజ(22; 13బంతుల్లో 3ఫోర్లు, సిక్సర్), పాటిల్(23; 15బంతుల్లో 4ఫోర్లు), మేఘన్ స్కట్(20), 14బంతుల్లో 3ఫోర్లు) రాణించారు. దీంతో బెంగళూరు జట్టు 155పరుగుల గౌరవప్రద స్కోర్ చేయగల్గింది. ఛేదనలో ముంబయి ఇండియన్స్ ఓపెనర్ హేలీ మ్యాథ్యూస్(77నాటౌట్; 38బంతుల్లో 13ఫోర్లు సిక్సర్) ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడింది. పవర్ హిట్టింగ్‌తో ఆర్సీబీ బౌలర్లపై విరుచుకు పడిన మాథ్యూస్ 26 బంతుల్లోనే అర్ధసెంచరీని పూర్తి చేసింది. యస్టికా భాటియా(23)తో కలిసి తొలి వికెట్‌కు వికెట్‌కు 45పరుగులు జతచేసింది. ఆ తర్వాత నాట్ స్కీవర్ బ్రంట్(55నాటౌట్; 29బంతుల్లో 9ఫోర్లు, సిక్సర్) కూడా అర్ధసెంచరీతో రాణించడంతో ముంబయి ఇండియన్స్ 14.2ఓవర్ల లోనే 159పరుగులు చేసి విజయం సాధించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ మాథ్యూస్‌కు లభించింది.
స్కోర్‌బోర్డు..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళల ఇన్నింగ్స్: స్మృతి మంధాన (సి)వాంగ్ (బి)మాథ్యూస్ 23, సోఫియా డివైన్ (సి)అమన్‌జ్యోత్ కౌర్ (బి)సైకా ఇషాక్ 16, దిషా కసత్ (బి)సైకా ఇషాక్ 0, ఎలిసే పెర్రీ (రనౌట్) బ్రంట్/హుమైరా 13, హీథర్ నైట్ (బి)మాథ్యూస్ 0, రీచా ఘోష్ (సి)స్కీవర్ (బి)మాథ్యూస్ 28, అహూజా (సి)యస్టికా (బి)పూజ 22, శ్రేయాంక పాటిల్ (ఎల్‌బి)స్కీవర్ బ్రంట్ 23, మేఘన్ స్కట్ (స్టంప్) యస్టికా (బి)అమేలియా కెర్ర్ 20, రేణుక సింగ్ (బి)అమేలియా కెర్ర్ 2, ప్రీతి బోస్ (నాటౌట్) 1, అదనం 7. (18.4 ఓవర్లలో ఆలౌట్) 155పరుగులు. వికెట్ల పతనం: 1/39, 2/39, 3/43, 4/43, 5/71, 6/105, 7/112, 8/146, 9/154, 10/155 బౌలింగ్: మాథ్యూస్ 4-0-28-3, స్కీవర్ బ్రంట్ 3-0-34-1, సైకా ఇషాక్ 4-0-26-2, వాంగ్ 2-0-18-0, అమేలియా కెర్ర్ 3.4-0-30-2, జి. కలిత 1-0-10-0, పూజ 1-0-8-1.
ముంబయి ఇండియన్స్ మహిళల ఇన్నింగ్స్: మాథ్యూస్ (నాటౌట్) 77, యస్టికా భాటియా (ఎల్‌బి) ప్రీతి బోస్ 23, స్కీవర్ బ్రంట్ (నాటౌట్) 55, అదనం 4. (14.2 ఓవర్లలో వికెట్ నష్టానికి) 159పరుగులు. వికెట్ల పతనం: 1/45, బౌలింగ్: రేణుక ఠాకూర్ 3-0-28-0, ప్రీతి బోస్ 4-0-34-1, మేఘన్ స్కట్ 3-0-32-0, ఎలీసే పెర్రీ 1.2-0-18-0, శ్రేయాంక పాటిల్ 2-0-32-0, సోఫియా డివైన్ 1-0-11-0.











