Mar 04,2023 14:34

టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు కోసం ఇండోర్‌ హౌల్కర్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన పిచ్‌పై ఐసీసీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. మ్యాచ్‌ ముగిసిన అనంతరం రిఫరీ క్రిస్‌ బ్రాడ్‌ ఐసీసీకి నివేదిక సమర్పించారు. ఇరుజట్ల కెప్టెన్లు రోహిత్‌ శర్మ, స్టీవ్‌ స్మిత్‌ల అభిప్రాయాలను కూడా ఆ నివేదికలో పొందుపరిచారు. నివేదిక పరిశీలించిన ఐసీసీ.. ఇండోర్‌ పిచ్‌ను నాసిరకం పిచ్‌గా పేర్కొంది. ఈ పీచ్‌కు 3 డీమెరిట్‌ పాయింట్లను కూడా విధిస్తున్నట్లు తెలిపింది. ఐసీసీ నిర్ణయంపై అప్పీల్‌ చేసుకునేందుకు బీసీసీఐకి 14 రోజుల గడువు లభించింది. ఇండోర్‌ పిచ్‌పై బ్యాటింగ్‌ చేసేందుకు ఇరుజట్ల ఆటగాళ్లు తీవ్రంగా ఇబ్బందిపడిన విషయం తెలిసిందే.