Sep 28,2023 16:45

విజయవాడ: ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ రూరల్‌ పరిధిలోని ప్రసాదంపాడులో గురువారం దారుణం జరిగింది. వివాహిత మహిళ నాలుగేళ్ల కుమార్తెను కేబుల్‌ వైరుతో ఉరేసి హతమార్చింది. అనంతరం కత్తితో పీక కోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. భర్త అనిల్‌ కుమార్‌ ఇచ్చిన సమాచారం మేరకు విజయవాడ పటమట పోలీసులు ఘటన స్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.