ప్రజాశక్తి -కలకడ-రాయచోటి (అన్నమయ్య) : జాతీయ కుటుంబ సర్వే పై అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు సర్వే సూపర్వైజర్ మోహన్ తెలిపారు. శనివారం మండల కేంద్రమైన కలకడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఏఎన్‌ఎంలు ఆశా వర్కర్ల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గ్రామాల్లో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే అరోవ విడత ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. ఈ సర్వే లో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారుల పర్యవేక్షణలో కలకడ పిహెచ్ సి పరిధిలో కలకడ ప్రాంతాన్ని రాండమ్ సర్వే మొదలుపెట్టారని చెప్పారు. ఈ మేరకు శనివారం సర్వే సూపరవైజర్ అధ్వర్యంలో బఅందం సర్వే చెప్పటారు. సర్వే వివరాలు ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ పాపులేషన్ సైన్స్ నివేదిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీహెచ్వో వెంకటేశు హెల్త్ ఎడ్యుకేటర్ రాజమ్మ, హెల్త్ సూపర్వైజర్ వెంకటేశ్వరరావు, ఆరోగ్య సిబ్బంది, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, తదితరులు పాల్గొన్నారు.










