ప్రజాశక్తి - బి.కొత్తకోట (రాయచోటి-అన్నమయ్య) : తంబళ్లపల్లి నియోజకవర్గం, బి.కొత్తకోట పట్టణం, ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద హెచ్‌ఈసీ గ్రూపు చదివి ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన ఫలితాల్లో 1000కి 935 మార్కులు సాధించి హసన్ రాష్ట్ర స్థాయిలో రెండవ ర్యాంక్, అన్నమయ్య జిల్లా స్థాయిలో మ్నెదటి ర్యాంకు కైవసం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో శనివారం కురుబలకోట మండలంలోని నిర్వహించిన జగనన్న ఆణిముత్యాలలో భాగంగా బి.కొత్తకోటకి చెందిన విద్యార్థి హసన్ కు రూ.15,000 నగదు బహుమతి అందించడంపై భారతీయ అంబేద్కర్ సేన (బాస్) ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి, అభినందించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ... హాసన్ బి.కొత్తకోట పట్టణ, తంబళ్లపల్లి నియోజకవర్గం ప్రతిష్టను పెంచారని కొనియాడారు. భవిష్యత్తులో ఈ విద్యార్థి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బాస్ నాయకులు సచిన్, సింగన్న, రామంజి, నక్క మహేష్, పలక వెంకటేష్, చంద్రశేఖర్, గంగాద్రి, తుపాకుల మణి, శ్రీనివాసులు, సురేష్, తదితరులు పాల్గొన్నారు.










