Mar 10,2023 10:17

ఆస్ట్రేలియా క్రికెట్‌లో విషాదం చోటుచేసుకుంది. ఆ జట్టు కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ తల్లి మరియా కమిన్స్‌ ఈ రోజు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె చికిత్స తీసుకుంటున్నారు. బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీలో భాగంగా భారత్‌లో ఉన్న పాట్‌ కమిన్స్‌.. తల్లి అనారోగ్యం కారణంగా రెండో టెస్టు ముగిసిన వెంటనే స్వదేశానికి వెళ్లాడు. మూడో టెస్టు నాటికి కమిన్స్‌ తిరిగి వస్తాడని భావించినప్పటికీ తల్లి ఆరోగ్యం విషమంగా ఉండడంతో అక్కడే ఉండిపోయాడు.
కమిన్స్‌ తల్లి మరియా మతికి క్రికెట్‌ ఆస్ట్రేలియా సంతాపం తెలిపింది. ఆమె మతికి సంతాపంగా అహ్మదాబాద్‌లో జరుగుతున్న నాలుగో టెస్టు రెండోరోజు ఆస్ట్రేలియా ఆటగాళ్లు చేతికి నల్ల బ్యాండ్లు తగిలించుకుని మైదానంలోకి వచ్చారు. కమిన్స్‌కు, ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు క్రికెట్‌ ఆస్ట్రేలియా పేర్కొంది. భారత క్రికెట్‌ బోర్డు బీసీసీఐ కూడా మరియా మతికి సంతాపం తెలిపింది.