Feb 06,2023 15:07

భారత్‌, ఆస్ట్రేలియా మధ్య బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో ఫిబ్రవరి 9 నుంచి ప్రారంభంకానుంది. ఈ సిరీస్‌ను 2-1తో ఆస్ట్రేలియా కైవసం చేసుకుంటుందని శీలంక మాజీ బ్యాటర్‌ మహేల జయవర్దనే జోస్యం చెప్పాడు. 'ఆసీస్‌-భారత్‌ మధ్య బోర్డర్‌ - గావస్కర్‌ ట్రోఫీ ఎప్పటికీ చారిత్రాత్మకంగానే ఉంటుంది. ఆస్ట్రేలియా బౌలర్లను భారత బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాలి. అయితే, తొలి టెస్టులో ఎవరు విజయం సాధిస్తారో వారికి ఒక మంచి ప్రారంభం దొరికినట్లవుతుంది. కానీ, ఎవరు విజేతగా నిలుస్తారనేది మాత్రం అంచనా వేయడం కష్టం. ఈ సిరీస్‌లో భారత్‌పై ఆస్ట్రేలియా అన్ని విధాలుగా పైచేయి సాధిస్తుందని భావిస్తున్నా. 2-1 తేడాతో సిరీస్‌ను ఆసీస్‌ కైవసం చేసుకుంటుంది. కానీ, ఆస్ట్రేలియాకు భారత్‌ గట్టి పోటీని ఇస్తుంది' అని జయవర్దనే పేర్కొన్నాడు.