ఢిల్లీ : బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వరుసగా రెండో విజయం అందుకుంది టీమిండియా. నాగ్‌పూర్ టెస్టులో ఆస్ట్రేలియాని ఇన్నింగ్స్ తేడాతో చిత్తు చేసిన భారత జట్టు, ఢిల్లీ టెస్టులో 6 వికెట్ల తేడాతో అద్భుత విజయం అందుకుంది. ఆసీస్ విధించిన 114 పరుగులను 4 వికెట్లు కోల్పోయి చేదించింది. దీంతో నాలుగు టెస్టు సిర్‌స్‌లలో భారత్ 2 విజయాలతో ముందంజలో ఉంది. తొలుత ఓవర్ నైట్ స్కోరు 61/1తో ఆట కొనసాగించిన ఆసీస్ రెండో ఇన్నింగ్స్ లో 113 పరుగులకే ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ లో ఒక పరుగు ఆధిక్యం కలుపుకొని భారత్ కు 115 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. జడేజా ఏడు వికెట్లు పడగొట్టగా, అశ్విన్ మూడు వికెట్లు తీశాడు. ఆసీస్ బ్యాటర్లలో ట్రావిస్ హెడ్ (43), లబుషేన్ (35) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఇక, లక్ష్య ఛేదనలో భారత్ 4 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. భారత్ బ్యాటర్లలో రోహిత్ 31, పుజార 31, కోహ్లా 20, భరత్ 23 పరుగులతో రాణించారు. అయ్యర్ 12, రాహుల్ 1 పరుగులు మాత్రమే మరోసారి నిరాశపరిచారు. ఆసీస్ బౌలర్లలో నాధన్ లియోన్ 2, మార్ఫి 1 వికెట్ తీసుకున్నారు.
- 3 వికెట్లు కోల్పోయిన భారత్..
రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 3 వికెట్లు కోల్పోయింది. తొలుత రాహుల్ ఔట్ అవ్వగా.. దాటిగా ఆడుతున్న రోహిత్ శర్శ(39) పరుగుల వద్ద రన్ ఔట్‌గా వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చి కోహ్లి 31 బంతులో 20 పరుగులు చేసి టాడ్ మర్ఫీ బౌలింగ్‌లో స్టంప్ ఔట్‌గా పెవిలియన్‌కు చేరాడు. ప్రస్తుతానికి భారత్ 76 పరుగులు చేసింది. గెలవాలంటే ఇంకా 39 పరుగులు చేయాల్సి ఉంది. క్రీజులో పుజారా, అయ్యర్ ఉన్నారు.
- జడేజా 7 వికెట్లు.. 113 పరుగులకు ఆసీస్ అలౌట్
ఢిల్లీ : ఢిల్లీ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 113 పరుగులకు అలౌట్ అయ్యింది. ఈ ఇన్నింగ్స్‌లో జడేజా 7 వికెట్లతో ఆకట్టుకున్నాడు. ఓవర్‌నైట్ స్కోరు 61/1 స్కోరుతో మూడో రోజు బ్యాటింగ్ మొదలెట్టిన ఆస్ట్రేలియాను తొలుత ఆశ్విన్ దెబ్బకొట్టాడు. ఓపెనర్ ట్రెవిస్ హెడ్‌ను ఔట్ చేశాడు. 9 పరుగులు చేసిన స్మిత్ ఆశ్విన్ బౌలింగ్‌లోనే పెవిలియన్‌కు చేరాడు. ఆ వెంటనే జడేజా బౌలింగ్‌లో లబుషేన్ క్లీన్ బౌల్డ్ కాగా.. అశ్విన్ బౌలింగ్‌లో మాట్ రెన్ షా ఎల్బీగా వెనుదిరిగాడు. 24 ఓవర్‌లో జడేజా వరుసగా రెండు బంతుల్లో రెండు వికెట్లు సాధించాడు. తొలి బంతికి హ్యాండ్ కాంబ్‌ను పెవిలియన్‌కు పంపగా.. రెండో బంతికి కమ్మిన్స్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. 7 పరుగులు చేసిన క్యారీని ఔట్ చేశాడు. అనంతరం నాథన్ లియోన్‌ను, మాథ్యూ కుహ్నెమాన్‌ను జడేజా ఔట్ చేశాడు. ఈ ఇన్నింగ్‌లో జడేజా 7, ఆశ్విన్ 3 వికెట్లు తీసుకున్నారు. ఆసీస్ బ్యాటర్లో హెడ్ 43 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో మిగిలిన ఒక్క పరుగు అధిక్యంతో కలిపి భారత్ ముందు కేవలం 115 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది.
- అశ్విన్, జడేజా మయాజాలం.. కష్టాలో ఆసీస్
ఢిల్లీ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా అశ్విన్, జడేజా దాటికి కష్టాలో పడింది. 111 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 85 పరుగుల వద్ద స్మిత్ (9) అశ్విన్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. ఆ వెంటనే జడేజా బౌలింగ్‌లో లబుషేన్ క్లీన్ బౌల్డ్ కాగా.. అశ్విన్ బౌలింగ్‌లో మాట్ రెన్ షా ఎల్బీగా వెనుదిరిగాడు. 24 ఓవర్‌లో జడేజా వరుసగా రెండు బంతుల్లో రెండు వికెట్లు సాధించాడు. తొలి బంతికి హ్యాండ్ కాంబ్‌ను పెవిలియన్‌కు పంపగా.. రెండో బంతికి కమ్మిన్స్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. 7 పరుగులు చేసిన క్యారీని జడేజా బుట్టలో వేసుకున్నాడు. ప్రస్తుతానికి ఆసీస్ స్కోరు 113/8గా ఉంది. క్రీజులో లియోన్, టాడ్ మర్ఫీ ఉన్నారు.
2ND Test. 24.3: Ravichandran Ashwin to Nathan Lyon 4 runs, Australia 100/7 https://t.co/hQpFkyZGW8 #INDvAUS @mastercardindia
— BCCI (@BCCI) February 19, 2023
- మూడో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా
ఢిల్లీ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు మూడో రోజు ఆట ప్రారంభమైంది. ఆదిలోనే ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రెవిస్ హెడ్‌ను అశ్విన్ పెవిలియన్‌కు పంపాడు. 43 పరుగులు చేసిన ట్రెవిస్ హెడ్ వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన 9 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. ప్రస్తుతానికి ఆస్ట్రేలియా 91/3గా ఉంది. క్రీజులో క్రీజులో లబుషేన్, రెన్‌షా ఉన్నారు.
Ashwin strikes again as Steve Smith is given out LBW.
— BCCI (@BCCI) February 19, 2023
Australia 85/3 in the second innings.
Live - https://t.co/hQpFkyZGW8 #INDvAUS @mastercardindia pic.twitter.com/RBS9tN1QPt










