Oct 15,2023 16:02

కమలాపూర్‌: పుట్టినరోజు వేడుకల్లో ఇద్దరు స్నేహితుల మధ్య తలెత్తిన తగాదా కాస్తా ఘర్షణకు దారితీసింది. దీంతో కోపంతో ఓ యువకు డు స్నేహితుడి తల్లిపై కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండలంలోని ఉప్పల్‌లో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. గ్రామస్థులు, పోలీసు ఇన్‌స్పెక్టర్‌ బి.సంజీవ్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉప్పల్‌ గ్రామానికి చెందిన ఏశాల వరప్రసాద్‌ అలియాస్‌ బిట్టు(18), అదే గ్రామానికి చెందిన ఏలిగేటి శ్రీకాంత్‌ ఇద్దరు స్నేహితులు. ఇద్దరి ఇండ్లు ఎదురెదురుగా ఉంటాయి. ఇద్దరు కూలి పని, ఇసుక ట్రాక్టర్ల డ్రైవింగ్‌ పనులు చేస్తుంటారు.