Feb 05,2023 09:15
  • భారత్‌, పాక్‌ క్రికెట్‌ బోర్డుల నిర్ణయం, సెప్టెంబర్‌లో టోర్నీ

ముంబయి : ఈ ఏడాది పాకిస్తాన్‌లో జరగాల్సిన ఆసియాకప్‌ టోర్నీ వేదిక మారింది. టోర్నీకి ఆతిథ్యమిచ్చే పాకిస్తాన్‌కు భారత జట్టును పంపేందుకు బిసిసిఐ విముఖత చూపడమే ఇందుకు కారణం. దీంతో తటస్థ వేదికపై టోర్నీ నిర్వహించేందుకు పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు నిర్ణయించింది. ఈ క్రమంలో యుఏఇ వేదికగా ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఆసియాకప్‌ టోర్నీ జరగనున్నట్లు ఇరుదేశాల క్రికెట్‌బోర్డులు ఓ నిర్ణయానికి వచ్చాయి.
బిసిసిఐ సెక్రటరీ జే షా మరియు పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు ఛైర్మన్‌ నజమ్‌ శెట్టి తొలిసారి పర్చ్యువల్‌గా సమావేశమై తటస్థవేదికపై టోర్నీ నిర్ణయానికి ఆమోదం తెలిపారు. శనివారం జరిగిన ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌(ఎసిసి) పర్చ్యువల్‌ సమావేశానికి ఆసియా క్రికెట్‌ జట్ల అధ్యక్షులందరూ పాల్గొన్నారు.
ఈ సమావేశంలో ఆఫ్ఘనిస్తాన్‌ క్రికెట్‌ అసోసియేషన్‌కు కేటాయించిన వార్షిక బడ్జెట్‌ను ఆరు నుంచి 15శాతానికి పెంచాలని తీర్మానించాయి. ఆఫ్ఘనిస్తాన్‌ మహిళల జట్టుపై తాలిబాన్లు ఉక్కుపాదం నిలపడంతో ఆ సమస్యను ఓ కొలిక్కి తీసుకొచ్చేందుకు ప్రయత్నించాలని నిర్ణయించారు. టోర్నీ టి20 ఫార్మాట్‌లో జరగ్గా.. ఈసారి మాత్రం వన్డే ఫార్మాట్‌లోనే జరగనుంది. గత ఏడాది దుబారు వేదికగా జరిగిన ఆసియాకప్‌ టైటిల్‌ను పాకిస్తాన్‌ జట్టు చేజిక్కించున్న సంగతి తెలిసిందే. ఆ జట్టు ఫైనల్లో పాకిస్తాన్‌ను ఓడించి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది