Jan 28,2023 12:55

రాంచీ : రాంచీలో శుక్రవారం రాత్రి జరిగిన తొలి టీ20లో 21 పరుగుల తేడాతో చిత్తయింది. న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌ లో చివరి ఓవర్‌ వేసిన అర్ష్‌ దీప్‌ ఏకంగా 27 పరుగులు ఇవ్వడమే.. కాకా తను ఓ చెత్త రికార్డును కూడా ఖాతాలో వేసుకున్నాడు. ఆఖరి ఓవర్‌ తొలి బంతికి అతను నో బాల్‌ వేశాడు. దాంతో, అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక నో బాల్స్‌ వేసిన బౌలర్‌ గా నిలిచాడు. ఇప్పటిదాకా 22 మ్యాచ్‌ ల్లో అతను 14 నో బాల్స్‌ వేశాడు. పాకిస్థాన్‌కు చెందిన హసన్‌ అలీ 11 నో బాల్స్‌తో రెండో స్థానంలో ఉన్నాడు. ఈ మ్యాచ్‌ లో భారత ఓటమికి యువ బౌలర్‌ అర్ష్‌ దీప్‌ సింగ్‌ కారణమని విమర్శకులు, నెటిజన్లు అతనిపై సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్‌ చేస్తున్నారు.