May 21,2023 21:37

రాష్ట్రాలకు స్కోచ్‌ నుంచి లేఖలు
అంతా భేష్‌ అంటూ ప్రతిపాదనలు
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి -అమరావతి:
ప్రతియేటా రాష్ట్ర ప్రభుత్వ శాఖల పనితీరుపై స్కోచ్‌ సంస్థ ఇచ్చే అవార్డులపై మళ్లీ దరఖాస్తులు కావాలని పిలుపు వచ్చింది. ఏటా ఇలాగే అన్ని రాష్ట్రాల నురచి దరఖాస్తులు ఆహ్వానించడం, వాటిని పరిశీలించి అవార్డులు అందించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ అవార్డులపై ఉన్నతాధికారుల్లోనే చర్చ జరుగుతోంది. ఇలా దరఖాస్తులు ఆహ్వానించడం వల్ల రాష్ట్రాల నుంచి అంతా బాగురదనే భావనతోనే నివేదికలు వెళ్తున్నట్లు అధికారులే అంగీకరిస్తున్నారు.
తాజాగా వ్యవసాయ అనుబంధ రంగాలు, పౌరసరఫరాలు, జిల్లాల పాలన, విద్య, ఆర్థిక, అటవీ, సాధారణ పరిపాలన శాఖ, వైద్య ఆరోగ్యం, నీటిపారుదల సంక్షేమం వంటి అనేక కీలక శాఖల నుంచి ప్రతిపాదనలు ఆహ్వానిస్తూ స్కోచ్‌ నుంచిలేఖ అందింది. ఈ లేఖ ఆధారంగా అన్ని శాఖలనూ అవార్డులకు ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపించాలని స్వయంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా సర్క్యులర్‌ జారీ చేశారు. ఈ ప్రతిపాదనల ఆధారంగానే అవార్డుల ప్రదానం కూడా జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రతిపాదనల్లో అంతా భేషుగ్గా ఉరదని, అభివృద్ధి చాలా బాగుందంటూనే ప్రతిపాదనలు వెళ్తున్నట్లు ఒక అధికారి వ్యాఖ్యానించడం గమనార్హం. ఇలా పంపించడం సరికాదన్న భావాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు.