ఇండోర్ : టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది. ఇండోర్ వేదికగా మొదలైన మూడో టెస్టులో ఆసీస్ ఇన్నింగ్స్‌లో ట్రెవిస్ హెడ్ వికెట్ తీయడం ద్వారా జడేజా అంతర్జాతీయ క్రికెట్‌లో 500 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. బ్యాటుతో 5 వేల పరుగులు, బంతితో 500 వికెట్లు తీసిన రెండో భారత క్రికెటర్‌గా నిలిచాడు రవీంద్ర జడేజా. ఇంతకముందు టీమిండియా నుంచి కపిల్ దేవ్ ఒక్కడే ఈ ఫీట్ సాధించాడు. ఓవరాల్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ ఫీట్ సాధించిన 11వ ప్లేయర్ జడేజా. ఇంతకుముందు కపిల్ దేవ్‌తో పాటు ఇమ్రాన్ ఖాన్, ఇయాన్ బోథమ్, వసీం అక్రమ్, షాన్ పోలాక్, చమిందా వాస్, డానియల్ విటోరి, జాక్వస్ కలీస్, షాహిద్ ఆఫ్రిదీ, షకీబ్ అల్ హసన్ ఈ ఫీట్ సాధించారు.










