Mar 25,2023 17:29

షార్జా : షార్జా వేదికగా శుక్రవారం జరిగిన తొలి టీ20లో పాక్‌స్థాన్‌పై అఫ్గాన్‌ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టీ20 ఫార్మాట్‌లో పాకిస్థాన్‌పై అఫ్గానిస్థాన్‌కిదే తొలి విజయం కావడం విశేషం. తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌ అఫ్గాన్‌ బౌలర్ల ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 92 పరుగులకే పరిమితమైంది. ఈ లక్ష్యాన్ని అఫ్గానిస్థాన్‌ నాలుగు వికెట్లు కోల్పోయి 13 బంతులు మిగిలుండగానే ఛేదించింది. లక్ష్యఛేదనలో 10 ఓవర్లకు 45/4 స్కోరుతో కష్టాల్లో ఉన్న అఫ్గానిస్థాన్‌ను మహమ్మద్‌ నబీ (38), నజీబుల్లా జద్రాన్‌ (17) నిలకడగా ఆడి గెలిపించారు.