May 22,2023 14:26

భారత జట్టు కిట్‌ స్పాన్సర్‌గా అడిడాస్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. ''భారత జట్టు కిట్‌ స్పాన్సర్‌గా అడిడాస్‌తో బీసీసీఐ ఒప్పందం కుదుర్చుకుంది. ప్రంచంలో నెం1 స్పోర్ట్స్‌ గూడ్స్‌ సంస్థ అడిడాస్‌తో జతకట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. భారత క్రికెట్‌ను మరింత అభివద్ది చేసేందుకు ప్రయత్నిస్తున్నాం'' అని జైషా ట్విటర్‌లో పేర్కొన్నారు.