Mar 09,2023 21:47

శ్రీలంక 306/6
క్రైస్ట్‌చర్చ్‌: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలిటెస్ట్‌లో శ్రీలంక కెప్టెన్‌ కరుణరత్నే, కుశాల్‌ మెండీస్‌ అర్ధసెంచరీలతో రాణించడంతో తొలిరోజు ఆట ముగిసే సమయానికి 6వికెట్ల నష్టానికి 305పరుగులు చేసింది. చివర్లో ధనుంజయ(39), రజిత(16) ఆదుకోవడంతో శ్రీలంక జట్టు తొలిరోజు ఆట ముగిసే సమయానికి 6వికెట్ల నష్టానికి 305పరుగులు చేసింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంకకు శుభారంభం దక్కలేదు. ఓపెనర్‌ ఫెర్నాండో(13) నిరాశపరిచినా.. కరుణరత్నే(50), కుశాల్‌ మెండీస్‌(87) కలిసి 2వ వికెట్‌కు 143పరుగులు జతచేశారు. ఆ తర్వాత శ్రీలంక జట్టు మరో 2 వికెట్లను వెంట వెంటనే కోల్పోయింది. 151పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ లంకను సీనియర్‌ టెస్ట్‌ బ్యాటర్‌ మాథ్యూస్‌(47), ఛండీమాల్‌(39) ఆదుకున్నారు. తొలిరోజు ఆట ముగిసే సమయానికి ధనుంజయ, రజిత క్రీజ్‌లో ఉన్నారు. కెప్టెన్‌ సౌథీకి మూడు, హెన్రీకి రెండు, బ్రాస్‌వెల్‌కు ఒక వికెట్‌ దక్కాయి.