ప్రజాశక్తి - తిరువూరు (ఎన్‌టిఆర్ జిల్లా) : ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరు బైపాస్ రోడ్‌పై గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ మహిళ అక్కడిక్కడే మృతి చెందగా మరో ఇరువురికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జాతీయ రహాదారిపై వెళ్తున్న కారును లారీ ఢ కొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న కోకా విజయలక్ష్మి(55) అక్కడిక్కడే మృతి చెందింది. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం తిరువూరు ప్రభుత్వ ఆసుప త్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.










