Mar 04,2023 22:05

ఇరానీ ట్రోఫీలో డబుల్‌ సెంచరీ, సెంచరీ చేసిన తొలి బ్యాటర్‌
గ్వాలియర్‌: ఇరానీ ట్రోఫీలో రెస్టాఫ్‌ ఇండియా యువ క్రికెటర్‌ యశస్వి జైస్వాల్‌ రెండో ఇన్నింగ్స్‌లోనూ సెంచరీతో కదం తొక్కాడు. దీంతో ఇరానీ ట్రోఫీ చరిత్రలో ఓ డబుల్‌ సెంచరీ, ఓ సెంచరీ కొట్టిన ఏకైక బ్యాటర్‌గా యశస్వి అరుదైన రికార్డును నెలకొల్పాడు. యశస్వి తొలి ఇన్నింగ్స్‌లో 213పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 144పరుగులు చేశాడు. శనివారం రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన రెస్టాఫ్‌ ఇండియా జట్టు 246పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌ 190 పరుగుల ఆధిక్యతను సంపాదించడంతో మధ్యప్రదేశ్‌ ముందు 437పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది. లక్ష్య ఛేదనలో నాల్గోరోజు ఆట ముగిసే సమయానికి మధ్యప్రదేశ్‌ జట్టు 2 వికెట్ల నష్టానికి 81పరుగులు చేసింది. మరో 356పరుగులు చేస్తే మధ్యప్రదేశ్‌ గెలుపొందనుంది.