- వన్డే ప్రపంచకప్‌కు బ్రేస్‌వెల్ దూరం?
లండన్: న్యూజిల్యాండ్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆల్‌రౌండర్ మైకేల్ బ్రేస్‌వెల్ వన్డే ప్రపంచకప్‌కు దూరం కానున్నాడు. ఇంగ్లండ్ కౌంటీల్లో వార్సెస్టర్‌షైర్ తరఫున ఆడుతున్న బ్రేస్‌వెల్.. యార్క్‌షైర్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడ్డాడు. 11 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద తీవ్రంగా గాయపడి రిటైర్డ్ హర్ట్‌గా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత పరీక్షల్లో అతని కుడి కాలి మడమ దగ్గర తీవ్రమైన గాయమైనట్లు తేలింది. దీంతో ఈ 32ఏళ్ల ఆల్‌రౌండర్‌కు ఇంగ్లండ్‌లోనే శస్త్రచికిత్స చేయనున్నారు. ఈ ఆపరేషన్ తర్వాత కనీసం రెండు వారాల విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందట. అనంతరం స్వదేశం వెళ్లిపోనున్న బ్రేస్‌వెల్.. అక్కడ ఆరు నుంచి ఎనిమిది నెలలపాటు రెస్ట్ తీసుకోవాలని వైద్యులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే ఈ ఏడాది చివర్లో భారత్ వేదికగా జరిగే వన్డే వరల్డ్ కప్‌లో అతను ఆడటం జరగదు.










