Dec 18,2022 14:20

ఓ.డి.చెరువు మండలం (శ్రీసత్యసాయి జిల్లా) : భార్యను భర్త దారుణంగా హత్య చేసిన ఘటన ఆదివారం శ్రీ సత్య సాయి జిల్లా ఓ.డి చెరువు మండలం వీరఓబునపల్లిలో చోటుచేసుకుంది. భార్య కేశమ్మను భర్త కేశవరెడ్డి హత్య చేశాడు. అక్రమ సంబంధాలే హత్యకు కారణంగా స్థానిక సమాచారం. భర్త పరారీలో ఉన్నాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.