Feb 26,2023 10:52
  • సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌

జైపూర్‌: సినీ తారల సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌(సిసిఎల్‌) సీజన్‌-7లో తెలుగు వారియర్స్‌ జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. అక్కినేని అఖిల్‌ సారథ్యంలోని తెలుగు వారియర్స్‌ జట్టు శనివారం జరిగిన రెండో మ్యాచ్‌లో బెంగాల్‌ టైగర్స్‌పై ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బెంగాల్‌ టైగర్స్‌ నిర్దేశించిన 115పరుగుల లక్ష్యాన్ని తెలుగు వారియర్స్‌ జట్టు మరో 11 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. అంతకుముందు బెంగాల్‌ వారియర్స్‌ జట్టులో సేన్‌ గుప్తా 83పరుగులతో రాణించడంతో బెంగాల్‌ జట్టు 10 ఓవర్లలో 114పరుగులు చేసింది. ఇదే వేదికపై జరిగిన తొలి మ్యాచ్‌లో భోజ్‌పూరి దబాంగ్స్‌ జట్టు 8వికెట్ల తేడాతో చెన్నై రైనోస్‌పై ఘన విజయం సాధించింది. ఇక 19న జరిగిన తొలి మ్యాచ్‌లో తెలుగు వారియర్స్‌ జట్టు 64పరుగుల తేడాతో కేరళ స్ట్రయికర్స్‌పై విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో తెలుగు వారియర్స్‌ వరుసగా రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ టోర్నమెంట్‌ మొత్తం 8జట్లు వేర్వేరు రాష్ట్రాలకు చెందిన జట్లు పాల్గొంటున్నాయి. మొత్తం 19 మ్యాచ్‌లు జరగనునున్నాయి. జైపూర్‌, హైదరాబాద్‌, రారుపూర్‌, జోథ్‌పూర్‌, బెంగళూరు మరియు తిరువనంతపురంతో సహా ఆరు నగరాల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి. 4న బెంగళూరు వేదికగా జరిగే మూడో మ్యాచ్‌లో తెలుగు వారియర్స్‌ జట్టు పంజాబ్‌ దే షేర్‌తో తలపడనుంది.