Sep 17,2023 21:40

ప్రజాశక్తి -నాగులుప్పలపాడు (ప్రకాశం జిల్లా) :ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం మద్దిరాలపాడులో జాతీయ రహదారిపై ఆదివారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం... బాపట్ల జిల్లా కొరిశపాడు మండలం పమిడిపాడు గ్రామానికి చెందిన మర్రిబోయిన మణికంఠ (21), బత్తిన అరవింద్‌ (19), మర్రిబోయిన గోపి (28) కలిసి వినాయక విగ్రహం కొనుగోలు కోసం ఒంగోలు వెళ్లి అడ్వాన్స్‌ ఇచ్చి ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి వస్తున్నారు. మద్దిరాలపాడు వద్ద అప్పటికే పంచరై ఆగి ఉన్న కంటైనర్‌ లారీని వారి బైక్‌ ఢకొీంది. దీంతో, వీరు ముగ్గురూ అక్కడికక్కడే మృతి చెందారు. గోపీ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నారు. ఆయనకు భార్య, సంవత్సరం వయస్సు ఉన్న కుమార్తె ఉన్నారు. హైదరాబాద్‌లోని ఓ ఫెర్టిలైజ్‌ షాపులో అరవింద్‌ పనిచేస్తున్నారు. మణికంఠ డిగ్రీ చదివి ఉద్యోగ వేటలో ఉన్నారు.