మీరట్ : టీమిండియా మాజీ క్రికెటర్ ప్రవీణ్ కుమార్‌కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని పాండవ్ నగర్ నుంచి మీరట్‌కు వస్తుండగా ప్రవీణ్ కుమార్ ప్రయాణిస్తున్న ల్యాండ్ రోవర్ కారును క్యాంటర్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రవీణ్ ప్రయాణిస్తున్న కారు నుజ్జుగుజ్జయ్యింది. ప్రమాద సమయంలో ప్రవీణ్‌తోపాటు అతని కుమారుడు కారులో ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్యాంటర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మీరట్ సిటీ ఎంట్రెన్స్‌లో మంగళవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో ఈ యాక్సిడెంట్ జరిగింది. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.










