థాయ్‌లాండ్‌కు చెందిన మహిళా క్రికెటర్ 6.1 ఓవర్లలో 6 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టి అందర్నీ ఆశ్చర్యపరించింది. ఏప్రిల్ 19న జింబాబ్వే-థాయ్‌లాండ్ జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన థాయ్‌లాండ్ కేవలం 154 పరుగులకే అలౌటయ్యింది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే జట్టును తిపాచా పుత్తావాంగ్ అద్భుత బౌలింగ్‌తో తిప్పలు పెట్టింది. ఈ 19 ఏళ్ల స్పిన్నర్ తిపాచా పుతావాంగ్ మొత్తం 6.1 ఓవర్లలో 6 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టింది. ఆమె వేసిన 6 ఓవర్లలో 2 మెయిడిన్ ఓవర్లు కూడా ఉన్నాయి. దీంతో థాయ్‌లాండ్ మహిళల జట్టు 78 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో పాటు తిపాచా 41 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టింది.
జనవరి 14, 1982న న్యూజిలాండ్ బౌలర్ జాకీ లార్డ్ ఆక్లాండ్‌లో భారత మహిళల జట్టుపై 8 ఓవర్లలో 10 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టింది. తిపాచా తన బౌలింగ్ ప్రదర్శనతో ఈ రికార్డును బద్దలు కొట్టింది. తద్వారా అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనతో ఎనిమిదో అతి పిన్న వయస్కురాలిగా నిలిచింది. 19 ఏళ్ల తిపాచా పుతావాంగ్ ఇప్పటివరకు కేవలం 5 వన్డేలు మాత్రమే ఆడింది. ఇందులో ఆమె 10 వికెట్లు పడగొట్టింది. అలాగే 24 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడి 22 వికెట్లు పడగొట్టింది.










