Dec 30,2022 11:52

లేపాక్షి మండలం (సత్య సాయి జిల్లా) : లేపాక్షి మండలంలో ఉన్న ప్రభుత్వ బాలుర వసతి గఅహంలో ఎస్‌ఎఫ్‌ఐ 53వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ఎస్‌ఎఫ్‌ఐ జెండాను ఆవిష్కరించి ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి బాబావలి మాట్లాడుతూ ... 1970 లో కేరళ రాష్ట్రం రాజధాని డిసెంబర్‌ 29, 30, 31 తేదీలలో అధ్యయనం పోరాటం అనే నినాదంతో స్వాతంత్రం ప్రజాస్వామ్యం సోషలిజం ఆశయాలతో అందరికీ ప్రభుత్వమే ఉచిత విద్యను అందించాలని, చదువుకున్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వమే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్లతో ఎస్‌ఎఫ్‌ఐ ఆవిర్భవించిందని తెలిపారు. ఎస్‌ఎఫ్‌ఐ ఏర్పాటు చేసుకున్నప్పటి నుంచి ఇప్పటివరకు విద్యారంగంలో వస్తున్న విద్యా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా సమరశీల పోరాటాలు నిర్వహించిందని రాబోవు రోజుల్లో కూడా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి, విద్యా ప్రైవేటీకరణ కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా ప్రభుత్వ విద్య పరిరక్షణకు కూడా పోరాటాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి బాబావలి, ఎస్‌ఎఫ్‌ఐ మండల నాయకులు కిషోర్‌, లోకేష్‌, వేణు, సాయి, అనిల్‌, నరేష్‌, విద్యార్థులు పాల్గొన్నారు.