ప్రజాశక్తి - ఓబులవారిపల్లి : మంగంపేట గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న ఈద్గా కు ముక్కా రూపానందరెడ్డి ఫౌండేషన్ ద్వారా మూడు లక్షల రూపాయల చెక్కును రాష్ట్ర నాయకులు ముక్కారూపానంద రెడ్డి మంగంపేట మైనారిటీ ముస్లింలకు అందజేశారు. గుంతకల్లు రైల్వే బోర్డు సభ్యులు తల్లం భరత్ కుమార్ రెడ్డి గజమాలతో ముక్కారూపానందరెడ్డిని ఘనంగా సన్మానించి పెద్ద ఎత్తున బాణాసంచా పేలుస్తూ పుష్పవర్షంతో మహిళలు పెద్ద ఎత్తున హారతి ఇస్తూ స్వాగతం పలికారు. ఈద్గా నిర్మాణం కొరకు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. మంగంపేట మసీదు నందు ముక్కారూపానందరెడ్డిని సాల్వతో మైనార్టీ సోదరులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ముక్కా మధుసూదన్ రెడ్డి రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి ముక్కా సాయి వికాస్ రెడ్డి, స్థానిక నాయకులు తల్లం రమణారెడ్డి పులపత్తూరి, రామసుబ్బారెడ్డి, బత్తిన వేణుగోపాల్ రెడ్డి, ఉపసర్పంచ్ కౌలూరు మధు సూదన్ రెడ్డి, జిల్లా కో ఆప్షన్ నెంబర్ అన్వర్ భాష మాజీ సర్పంచ్ శ్రీధర్ రెడ్డి, మైనార్టీ నాయకులు ముజీబ్ ఎస్ ఏ సలాం కులయప్ప రహీం అబ్దుల్లా, జిలాని మంగంపేట సర్పంచ్ మినుకు సుధాకర్, గుంతకల్లు తల్లెం చంద్రమోహన్ రెడ్డి, కౌలూరు సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.










