హైదరాబాద్: తెలంగాణలో రైతులకు పేరుకే 24 గంటల విద్యుత్ ఇస్తున్నారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గంట కూడా సక్రమంగా ఇవ్వడంలేదని విమర్శించారు. నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నట్లు నిరూపిస్తే తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానన్నారు. ఏ సబ్‌స్టేషన్ వద్దకైనా వెళ్దామని.. నిరంతరాయంగా విద్యుత్ ఇస్తున్నట్లు నిరూపించాలన్నారు. మిగులు బడ్జెట్‌తో ఏర్పాటైన రాష్ట్రంలో ఉద్యోగులకు సక్రమంగా వేతనాలు ఇచ్చే పరిస్థితి లేదని ఆరోపించారు.మూడు గంటలు కావాలా? లేక మూడు పంటల కావాలా? అని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కోమటిరెడ్డి మండిపడ్డారు. కావాలని సత్యగ్రహ దీక్షను భగం చేయడానికి బిఆర్‌ఎస్ చేస్తున్న కుట్ర అని ఆరోపించారు. కాంగ్రెస్ బలపడుతోందనే భయంతోనే లేని విషయాన్ని ఉన్నట్లుగా సఅష్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.










