Jun 12,2023 16:04

ముంబై : ఈ ఏడాది చివరలో భారత్‌ వేదికగా వన్డే ప్రపంచకప్‌ 2023 జరగనుంది. ఈ మెగా టోర్నీకి సంబంధించిన షెడ్యూల్‌ (డ్రాప్ట్‌ షెడ్యూల్‌)ను బీసీసీఐ నేడు విడుదల చేసింది. ప్రపంచకప్‌ డ్రాప్ట్‌ షెడ్యూల్‌ను బీసీసీఐ ఐసీసీకి పంపింది. ప్రపంచకప్‌ ఆడే మిగతా దేశాలకు కూడా ఈ షెడ్యూల్‌ను పంపిస్తారు. ఆ దేశాల నుంచి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకున్న అనంతరం ఫైనల్‌ షెడ్యూల్‌ను రూపొందిస్తారు. ఆ షెడ్యూల్‌ను ఐసీసీ అధికారికంగా ప్రకటిస్తుంది. బీసీసీఐ ముసాయిదా షెడ్యూల్‌ ప్రకారం 2023 అక్టోబర్‌ 5న వన్డే ప్రపంచకప్‌ ఆరంబం కానుంది. మెగా టోర్నీ తొలి మ్యాచ్‌లో ఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లండ్‌, రన్నరప్‌ న్యూజిలాండ్‌ తలపడనున్నాయి. భారత్‌ తన తొలి మ్యాచ్‌ను అక్టోబర్‌ 8న ఆస్ట్రేలియాతో ఆడనుంది. పాకిస్థాన్‌తో అహ్మదాబాద్‌ వేదికగా అక్టోబర్‌ 15న భారత్‌ తలపడనుంది. నవంబర్‌ 19న అహ్మదాబాద్‌ వేదికగా ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. మొత్తం 10 జట్లు పాల్గొనే వన్డే ప్రపంచకప్‌ 2023 టోర్నీలో ఇప్పటికే 8 జట్లు అర్హత సాధించాయి. క్వాలిఫయర్స్‌ ద్వారా మరో రెండు జట్లు అర్హత సాదిస్తాయి. ఫైనల్‌ మ్యాచ్‌ కోసం వేదికగా ఖరారు అయినా.. నవంబర్‌ 15, 16 తేదీల్లో జరిగే సెమీ ఫైనల్స్‌ వేదికలు మాత్రం ఖరారు కాలేదు.

భారత్‌ షెడ్యూల్‌:
అక్టోబర్‌ 8 : భారత్‌ - ఆస్ట్రేలియాతో (చెన్నై)
అక్టోబర్‌ 11 : భారత్‌ - అఫ్గానిస్థాన్‌ (ఢిల్లీ)
అక్టోబర్‌ 15 : భారత్‌ - పాకిస్థాన్‌ (అహ్మదాబాద్‌)
అక్టోబర్‌ 19 : భారత్‌ - బంగ్లాదేశ్‌ (పుణె)
అక్టోబర్‌ 22 : భారత్‌ - న్యూజిలాండ్‌ (ధర్మశాల)
అక్టోబర్‌ 29 : భారత్‌ - ఇంగ్లండ్‌ (లక్నో)
నవంబర్‌ 2 : భారత్‌ - క్వాలిఫయర్‌ టీం (ముంబై)
నవంబర్‌ 5 : భారత్‌ - దక్షిణాఫ్రికా (కోల్‌కతా)
నవంబర్‌ 11 : భారత్‌ - క్వాలిఫయర్‌ టీం (బెంగళూరు)