Apr 17,2023 22:07

ఫొటో: మాట్లాడుతున్న బిఎస్‌పి రాష్ట్ర అధ్యక్షులు పరంజ్యోతి

175 స్థానాల్లోనూ పోటీకి సిద్ధం
- బిఎస్‌పి రాష్ట్ర అధ్యక్షులు పరంజ్యోతి
ప్రజాశక్తి ఆత్మకూర్‌ అర్బన్‌ : రాబోయే 2024 ఎన్నికలలో బహుజన సమాజ్‌ పార్టీ రాష్ట్రంలో ఉన్న 175 అసెంబ్లీ స్థానాలలో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని బిఎస్‌పి రాష్ట్ర అధ్యక్షులు పరంజ్యోతి అన్నారు. సోమవారం ఆత్మకూరు నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్షురాలు పుష్పాంజలి అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పరంజ్యోతి మాట్లాడుతూ రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు పర్యటిస్తున్నామని, ఎస్‌సి ఎస్‌టి బిసి మైనారిటీ ప్రజలైన బహుజనులను రాబోయే ఎన్నికలలో బహుజన సమాజ్‌ పార్టీకి మంచి ఫలితాలు ఇచ్చేటువంటి ఎన్నికలలో ఒక శక్తిగా గెలిచేందుకు అవకాశం ఉందన్నారు.
బిసిలకు 100 సీట్లు ఇచ్చేందుకు బిఎస్‌పి సిద్ధంగా ఉందన్నారు. టిడిపి, వైసిపిలు బహుజనులకు చేసిందేమీ లేదన్నారు. బహుజనులందరూ ఈ రెండు పార్టీలపై విసిగిపోయి ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. అలాంటి క్రమంలో అంబేద్కర్‌ ఆశయాలతో ముందుకు వెళ్లే ఏకైక పార్టీ బహుజన సమాజ్‌ పార్టీని అన్నారు. రాష్ట్రంలో పెరిగిన గ్యాస్‌, వంటనూనె, నిత్యావసర సరుకులు, పెట్రోల్‌, డీజిల్‌ కూరగాయలు ఇలా వాటిపై అధిక ధరల మోపడంతో ప్రజలు అల్లాడిపోతున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జానకి ప్రసాద్‌ మాట్లాడుతూ నందా ఓబులేసు నిరంతరం పార్టీ కోసం శ్రమించాడని దాన్ని గుర్తించి ఆయనకు బై ఎలక్షన్‌లో పోటీ చేయడం అవకాశం రావడం దాంతో మండుటెండర్లో ఓబులేసు శ్రమించి పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లడం సంతోషకరమైన విషయమన్నారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో మంచి ఫలితాలు సాధించేందుకు బహుజనులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఆత్మకూరు నియోజకవర్గ అధ్యక్షులు నంద ఓబులేసు మాట్లాడుతూ పార్టీని నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరును మొదటి స్థానంలో తీసుకువస్తామన్నారు. బహుజనుల పార్టీ బహుజన సమాజ్‌ పార్టీని ఆ పార్టీని గెలిపించుకోవడానికి బహుజనులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా ఇన్‌ఛార్జి శ్రీరామ్‌, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ అశోక్‌, ఉపాధ్యక్షులు రవి, ప్రధాన కార్యదర్శి కృష్ణ, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ జ్యోతి శ్రీను, ఆత్మకూరు మండల అధ్యక్షులు చింత రమేష్‌, ఉపాధ్యక్షులు శేషయ్య, చేజర్ల మండలం అధ్యక్షులు దివానపు వెంకటేశ్వర్లు, సంగం అధ్యక్షులు గంటా సునీల్‌, అనంతసాగరం అధ్యక్షులు కాలువ రాహుల్‌, ఆత్మకూరు టౌన్‌ అధ్యక్షులు ఆత్మకూరు వెంకటేశ్వర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.