- ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్
రాంచీ: 26వ జాతీయ ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ పోటీల్లో జ్యోతి యర్రాజీ మహిళల 100మీ. హార్డిల్స్‌లో మీట్ రికార్డు నెలకొల్పి పతకం కైవసం చేసుకుంది. బుధవారం జరిగిన 100మీ. హార్డిల్స్‌ను జ్యోతి 12.89సెకన్లలో గమ్యానికి చేరింది. మంగళవారం జరిగిన హీట్స్‌లో 13.18సెకన్లలో గమ్యానికి చేరి ఫైనల్‌కు చేరిన జ్యోతి.. ఫైనల్లో తన రికార్డును సవరించుకుంది. ఇక గత ఏడాది బెంగళూరులో జరిగిన నేషనల్ ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ 12.82సెకన్ల జాతీయ రికార్డును మాత్రం అధిగమించలేకపోయింది. ఇక తమిళనాడుకు చెందిన ఆర్. నిత్య రామ్‌రాజ్(13.44సెకన్లు), జార్ఖండ్‌కు చెందిన సప్న కుమారి(13.58సెకన్లు) రెండు, మూడు స్థానాల్లో నిలిచి రజిత, కాంస్య పతకాలను కైవసం చేసుకున్నారు. వీరితోపాటు నాల్గోస్థానంలో నిలిచిన ఒరిస్సాకు చెందిన ప్రజ్ఞా ప్రశాంత్ 13.72సెకన్లు ఆసియా ఛాంపియన్‌షిప్‌పోటీలకు అర్హత సాధించారు.










