Oct 04,2022 18:42

పురుషుల 200మీ. పరుగులో అమ్లన్‌ రికార్డు
అహ్మదాబాద్‌:
గుజరాత్‌ వేదికగా జరుగుతున్న 36వ జాతీయ క్రీడల్లో రికార్డులు నమోదవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జ్యోతి యర్రాజి 100మీ. హర్డిల్స్‌లో 12.79సెకన్లలో గమ్యానికి చేరి ప్రథమ స్థానంలో నిలిచి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. మంగళవారం పురుషుల 200మీ. పరుగులో అమ్లన్‌ బోర్గోహైన్‌ రికార్డు స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. అస్సాంకు చెందిన అమ్లన్‌ 200మీ. పరుగును 20.55సెకన్లలో పూర్తి చేసుకొని ప్రథమస్థానంలో నిలిచాడు. ఈ రికార్డు ఇంతకుముందు అమ్లన్‌ పేర(21.06సెకన్లు)గా ఉండగా.. తాజాగా తన రికార్డును తిరగరాసింది. ఇక అభిన్‌ దెవడిగా(కర్ణాటక), మహ్మద్‌ అజ్మల్‌(సర్వీసెస్‌) రజత, కాంస్యాలను గెలిచారు. ఇక మహిళల 200మీ. పరుగులో అస్సాంకు చెందిన హిమాదాస్‌కు రజత పతకం లభించింది. ఆమె 23.06సెకన్లలో గమ్యానికి చేరి రెండోస్థానంలో నిలువగా.. ఈ విభాగంలో అర్చన సుశేంద్రన్‌కు స్వర్ణ పతకం దక్కింది.