హైదరాబాద్ : జనాభాలో సగమైన తమకు చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల సైతం అమలు చేయాలని పోరాడిన ఎమ్మెల్సీ కవిత ఉద్యమం వృథాకాలేదని, కవిత పోరాటానికి కేంద్ర ప్రభుత్వం తలగ్గిందని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదించడంపై మంత్రి సత్యవతి స్పందించారు.చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనుక ఎమ్మెల్సీ కవిత, బీఆర్‌ఎస్ కఅషి ఉందన్నారు. ఈ పోరాట ఫలితంగా లోక్ సభ, అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు దక్కనున్నాయి. మహిళా బిల్లుపై కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ఆకాశంలో సగం, భూమిలో సగం, అధికారంలో సగం నినాదం అమలు కానుందని చెప్పారు.










