Sep 16,2023 21:57

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సిల్క్‌ డెవలప్‌మెంటు ప్రాజెక్టు వాస్తవాలను చర్చించేందుకు లోకేష్‌ ఛాలెంజ్‌కు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సిద్ధమా? అని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కె అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. మంగళగిరిలోని టిడిపి కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో శనివారం ఆయన మాట్లాడారు. నిడదవోలు సభలో సిఎం వ్యాఖ్యలపై అచ్చెన్నాయుడు తీవ్రంగా స్పందించారు. జగన్‌ రూ.40 వేల కోట్లు దోచుకున్న ఆర్థిక ఉగ్రవాది అని అన్నారు. చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులకు స్కీల్‌ డెవలప్‌మెంటు ప్రాజెక్టులో ఒక్క రూపాయి అందినట్లు జగన్‌ నిరూపించగలరా? అని ప్రశ్నించారు. జైలులో చంద్రబాబును కలిసి పవన్‌కల్యాణ్‌ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంటే.. వైసిపి నేతలకు ఓటమి భయం పట్టుకుందన్నారు. ఆయనతోపాటు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర యాదవ్‌ ఉన్నారు.