అమరావతి: ఏపీ సీఎం జగన్ చేసిన పాపాలు రాయలసీమ ప్రాంతానికి శాపాలుగా మారుతున్నాయని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. జగన్ చేసిన నేరాలు, ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలకు ఉరివేస్తున్నాయన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ (ట్విటర్‌లో) పోస్టు చేశారు. అక్రమాస్తుల కేసుల మాఫీ కోసం ప్రత్యేక హౌదా వదులుకున్నారని, రుషికొండకు గుండు కొట్టిన కేసు నుంచి తప్పించుకునేందుకు విశాఖ రైల్వేజోన్‌కి నీళ్లదిలారని విమర్శించారు.''బాబారుని చంపించిన కేసులో తమ్ముడిని రక్షించుకునేందుకు ఏకంగా ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టును ప్రశ్నార్థకం చేశారు. రాయలసీమ బిడ్డనంటూ క్యాన్సర్ గడ్డలా పీడిస్తున్నారు. జగన్ సర్కారు దారుణ వైఫల్యం వల్లే కఅష్ణా జలాల కేటాయింపులో పున్ణసమీక్ష జరుగుతోంది. ప్రజలారా జగన్‌కి ఇచ్చిన ఒక్క ఛాన్స్‌తో ఏమేం కోల్పోయారో గుర్తించండి. రాయలసీమ సాగు, తాగునీటి అవసరాలు తీర్చే కఅష్ణా జలాల్లో న్యాయబద్ధమైన వాటా కోల్పోతే సీమ ఎడారిగా మారే ప్రమాదం ఉంది'' అని లోకేశ్ తన పోస్టులో పేర్కొన్నారు.










