అమరావతి: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టు అక్రమమని ప్రజలకు తెలియజెప్పేందుకే నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నట్లు మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు తెలిపారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో వరుసగా రెండో రోజు ఆయన దీక్ష కొనసాగించారు. చంద్రబాబు విడుదలయ్యేంత వరకు వెనక్కి తగ్గబోనని స్పష్టం చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ల ద్వారా 2 లక్షల మందికి పైగా యువతకు శిక్షణ ఇచ్చి.. ఉద్యోగాలు వచ్చేలా చంద్రబాబు కృషి చేశారని, అలాంటి వ్యక్తిని దురుద్దేశ పూర్వకంగా జైలుకు పంపారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజస్వామ్యంపై నమ్మకం ఉన్న అధికారులెవ్వరూ సీఎం జగన్ మోహన్‌రెడ్డికి సహకరించవద్దని శ్రీనివాసులు కోరారు.










